అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రెడ్డిగారు ఆగుదాం అనుకున్నా చూడవలసినవి చాలా ఉన్నాయని బైకులు పైన కొనసాగారు హైదరాబాద్ సిద్దిపేట హైవే దాటారు అప్పుడు గుర్తొచ్చింది ఒకసారి అహోబిలం కరుణాకర్ సామలేటి మహేష్ హరి గోపాల్ గారు కొండపాకలో ఏరిన పూసలు సేకరించిన తొలి యుగపు మట్టి పాత్రలు బొమ్మల గురించి రాయగా చదివినవి మదిలో మెరిసి  కొండపాకకు మళ్ళించారు. అందరూ కూడా పొలాల్లో కాలు మోపి కళ్ళతో నేలంతా జల్లెడ పట్టగా ఎన్ని పూసలో రంగురంగు పూసలు రకరకాల మట్టి పాత్రలు అనేక రంగుల డిజైన్ల  పింగాణీ పోతగల మట్టి పెంకులు వంగి వంగి చూస్తున్న వారికి నడుములు నొప్పించాయి కొండపాకలో ఉన్న కాకతీయుల కాలపు ఆలయంలో ఒకదాని స్థానికులే బాగు చేసుకున్నారు  మరో దాన్ని పురావస్తు శాఖ ఊడదీసి కట్టిన గత వైపోవాలని అందించలేక మళ్ళీ శిథిలాల్లాగానే కనపడేలా చేసింది అన్న బాధ కలిగింది రెడ్డి గారికి.
కాకతీయుల ఆలయం బయట పడున్న నల్ల శానపు నంది శాసన శకలం శివలింగం కొత్త ఆలయం మెట్ల ముందు సప్తమాతల శిలాఫలకం ఎడమవైపున స్థానికులు భద్రపరిచిన శాసన స్తంభం అన్నీ చూసి బయటికి వచ్చిన  
వారికి పునర్మించిన గుడి ఆలనా పాలన నేటికీ నిర్లక్ష్యపు నీడల ఛాయలో అంట కాగుతున్నది అన్న నిస్పృహ అవహించింది. శాసనాలు కిందపడి శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నాయి కొండమీద శివాలయం ప్రక్కన గుండ్ల మీద ఉన్న కళ్యాణీ చాళుక్య త్రిభువన మల్ల దేవుని భార్య లక్ష్మీదేవి శాసనాన్ని శివాలయంలో 130 మంది ఎక్కటీలు (సైనికులు) వేయించిన కాకతీయ రుద్ర దేవుని కాలపు  క్రీస్తు శకం 1194 శాసనాన్ని  అదే ఆలయంలో మరో వంద మంది ఏక్కటీలు వేయించిన కాకతీయ గణపతి దేవుని కాలము నాటి  1225 శాసనాన్ని చదివి కొండపాక గ్రామ సైనికుల గ్రామంగా ఉండేదని తెలుసుకున్నారు రెడ్డి గారు. మళ్లీ ప్రయాణమై  దుద్దెడ చెరుకున్నారు. అదృష్టవషత్తు ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి కనుక శివాలయం లోపలికి వెళ్ళగానే ఎడమవైపు అరుగు మీద ఒక జైన విగ్రహం నల్ల రంగు పులుముకుని ఒక ప్రక్క నుంది అనేకంటే ప్రక్కన  పెట్టారు అనాలి. ఆలయ గోడలు స్తంభాలు ద్వారా శాఖలు సప్తమాతలు శిల్పాలకు సున్నాలు ఘట్టంగా కొట్టడంతో ఆ శిల్పాలు చారిత్రక ప్రాముఖ్యతను కోల్పోయాయి ఒకసారి ఆలయం చుట్టూ తిరిగారు  ప్రకారం ఒకటో రెండో సార్లు జీర్ణోద్ధరణకు గురి అయ్యి  ఆనవాళ్లు కోల్పోయింది. బయటకు వచ్చారు రెండు అంతస్తుల ప్రవేశ మండప స్తంభాలకు రంగు వేయడం వారిని కొంగ తీసింది మంచిగా ఒక అధునాతన అద్దాల మేడను జోడించి ఆలయ అధికారులు చేతులు దులుపుకోవడం  వారసత్వ ప్రేమికులుగా రెడ్డి గారి బృందం నోరు వెళ్ళబెట్టుకున్నారు


కామెంట్‌లు