అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రెడ్డిగారు నసీరుద్దీన్ మళ్లీ నిట్టూర్పులు సిద్దిపేట విడిచి వరదరాజపురం చేరుకున్నారు అక్కడ సువిశాల రంగనాయక దేవాలయాన్ని ఆలయం ముందు మండపాలను ఆనుకొని కట్టిన నివాస గృహాల మధ్యయుగ అనంతరం కాలపు ఆలయ నిర్మాణ రీతిని చూసి ఆశ్చర్య పోయారు.   ఇప్పటి ఆలయాలు మండపాలు దీప స్తంభాలు, శిలలు శిల్పాలు శాసనాలు అవి పడుతున్న పాటులను చూసి ఈ శిథిరాలను పదులపరిచే నాధుడు లేడా అని ఒగచి కాసేపు చెట్టు కింద జారపడ్డారు రెడ్డి గారు. సార్  క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఒక నిలుపురాయి( మెన్ హిర్ ని) నన్ను చూపిస్తానన్నా నసీరుద్దీన్ మాటలు రెడ్డి గారి మనసులో ఆనందపు బాటలు వేశాయి. వెంటనే లేచి మూడు కిలోమీటర్ల దూరంలో వెంకటాపూర్ శివారులో చిన్న గుట్ల పైకి వెళ్లారు అక్కడున్న ఇనుపయోగపు సమాధులు  వాటి చుట్టూ పాతిన గుండ్ల రాళ్లు బాగా వంగిపోయిన నిలువురా తిని పరిశీలిస్తున్నారు. ఇంతలో ఇద్దరు రైతులు వచ్చి మేము నిధుల వేటగాళ్లు అన్న అనుమానంతో యక్ష ప్రశ్నలను  సంధించారు  వారికి తమ గురించి చెప్పి మళ్ళీ బయలుదేరారు ఉద్ద మర్రి లోని అక్కన్న, మాదన్న దేవాలయం చూశారు. హిందూ దేవాలయమే కానీ  ముస్లిం వాస్తు రీతులు కనబడుతున్నాయి తరువాత నాగిశెట్టిపల్లి శివారులోని కేసారం పొలాల్లో ఉన్న ఇనుప యుగపు సమాధులను రామాలయం కోనేరు పాత దేవాలయాలను చూస్తూ ఉండగా  సూర్యుడు కనుమరుగయ్యాడు నసీరుద్దీన్ ఇవాల్టికి చాల్లే అన్నాడు  కారు జోరందుకుంది ఒక అరగంటలో తుర్కపల్లి అడ్డరోడ్డులో టీ తాగి నసీరుద్దీన్ ఇచ్చిన వీడుకోలుతో రెడ్డి గారు హైదరాబాదుకు బయలుదేరారు మళ్ళీ అవే గుళ్ళు శాసనాలు చుట్టుముట్టి ప్రశ్నిస్తున్నాయి  సమాధానాలు కోసం వెతుకుతూ వెతుకుతూ ఇంటికి చేరుకున్నారు రెడ్డి గారు. ఆనాడు శ్రీ నాథుడు  పల్నాటి రుచులను  ఎంత అందంగా ఒక్కొక్క దాని  మూలాలకు వెళ్లి చెప్పి  చదువరులకు నోరూరింప చేసేవారో  అలాగే శివ నాగిరెడ్డి గారు  తాను తింటున్న  ప్రతి పదార్థం ఎలా తయారు చేశారో  ఆ తయారు చేసిన వారు  ఆ గృహిణి ఆ ఇంటి పిల్లలు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా వడ్డిస్తూ ఉంటే  ఆ కూరలు   పొడులు  ఆనాటి కాళిదాసు రచించిన  మాహిషంశ శరత్ చంద్ర చంద్రికా దవళం దతి అన్నట్టు గడ్డ పెరుగును రెడ్డి గారు వర్ణించిన పద్ధతి  జ్ఞాపకం చేస్తుంది  ఏ ప్రాంతంలో ఎలాంటి వంటకాలు తయారవుతాయో కూడా వారి రచనల్లో మనం గమనించవచ్చు  ఏ రచన అయినా చదివించే గుణం లోపిస్తే  ఆ రచన మరుగున పడిపోతుంది  అలా జరగకుండా చదువరులను తన వెంట నడిచే పద్ధతిలో  శివ నాగిరెడ్డి గారి రచన పద్ధతి నడుస్తోంది అనడంలో రెండవ అభిప్రాయానికి అవకాశమే లేదు.


కామెంట్‌లు