అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆలయం వెనక బౌద్ధారామానవాళ్లతో పాటు పల్నాటి సున్నపురాతి స్తంభం దాని పైన ఇక్ష్వాకుల కాలపు ప్రాకృత శాసనంలోని అందమైన అక్షరాలు మళ్లీ ఇక్కడ బౌద్ధం పల్లవిస్తుందన్న ఆశను ఊరిస్తున్నాయి భారత పురావస్తు  సంస్థ రక్షిత కట్టడాల జాబితాలో చేరిన ఈ సముదాయంలో చాళుక్యుల నమూనా ఆలయాలు పల్నాటి సున్నపురాతి రెండు చేతుల గణేశుడు సూర్యుడు రాష్ట్రంలోని మొదటిదైన వ్యయ లింగాల శిలాఫలకం చాణిక్య సంప్రదాయంతో తీర్చిదిద్దిన నంది  సహజసిద్ధ మాతృత్వానికి ప్రత్యేకమైన సప్తమాతడు రకరకాల శివలింగాలు ఒకటేమిటి తరతరాల వాస్తు శిల్ప ప్రదర్శనశాలను తలపించింది- చేజర్ల అన్నీ బాగానే ఉన్నాయి కానీ వంచనకు గురైన పంచశీల గుర్తుకొచ్చి చరిత్రకు జరిగిన హాని రెడ్డి గారి గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. చేజర్లలో ఇక్ష్వాకుల కాలపు ప్రాకృత శాసనం కాక ఉన్న 9 శాసనాల్లో తూర్పు చాళుక్యరాదైన విషమసిద్ధి పిలిచి శకం ఏడవ శతాబ్ది తెలుగు శాసనం  తేదీ లేని రెండు కంన్దరపుర వర జన పద పతి శాసనాలు  క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్ది తెలుగు శాసనం  క్రీస్తు శకం 114 శాసనం క్రీస్తు శకం 1163 1165 1174 నాటి తాడూరి కేతిరెడ్డి శాసనాలు క్రీస్తుశకం 1247 నాటి నాలుగు సహస్ర లింగాల శాసనాల్లో తెలుగు భాష చరిత్రకు ఉపకరించే రెండు శాసనాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు అంటారు రెడ్డి గారు.  విజయనగర సమ్రాట్ శ్రీ రాజాధిరాజరాజ పరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీకృష్ణదేవ మహారాయల ప్రసక్తి గల క్రీస్తు శకం 1717 జూన్ 19వ తేదీ నాటి శాసనం ఆలయ మండపం దగ్గర ఉంది 97 పంక్తులు ఉన్నాయి తెలుగు శాసనంలో శ్రీకృష్ణదేవరాయుని భార్య ( ప్రధాని) శ్రీ సల్వాదిమ్మరుసు సయ్యం గారు శ్రీ కపోతేశ్వరాలయాలకు చెందిన (చేజర్ల) శ్రీకరణ నమ శరవారుల (నమశ్శివాయ గారు) శ్రీ కపోతేశ్వర స్వామికి ఇంకా ఇతర శివాలయాలకు ఇచ్చిన వివరాలు ఉన్నాయి. తెలుగు శాసనమున్న దేవాలయాన్ని చూడబోతున్నామని చెబుతూ విజయవాడలో బయలుదేరి విప్పర్లకు చేరిన రెడ్డి గారికి  నిర్లక్ష్యంగా పడి ఉన్న శాస్త్రాలు నిరాశలు మిగిల్చాయి ఉన్నపలంగా మత మార్పిడికి గురైన చేజర్ల బౌద్ధారామంలోని స్తంభాలు  శివాలయం మండప భారాన్ని మోస్తూ నిట్టూర్పు విడుస్తున్నాయి  ఒకప్పుడు బౌద్ధ ధర్మ నిలయాలైన చైత్య విహార శిథిలాలు- మరో అశోకుని కోసం ఎదురుచూస్తున్నాయి.  త్యాగనిరతికి బౌద్ధ ధార్మిక ఔన్నత్యానికి  ప్రతీక అయినా  సిబి జాతకం మరో-మత ఘాతుకానికి బలయింది వర్షావాసాలుగా ధ్యానం చేసి సమాధి స్థితిలో నిర్వాణా రంగాన్ని సరిచూపించిన గుహలు కల్పిత మేకాల మల్లయ్య నివాసాలుగా మారిపోయాయి ఏది ఏమైతేనే విప్పర్లలో తొంగిచూసిన తెలుగు అటు తర్వాత వెలుగును కోల్పోయింది.



కామెంట్‌లు