అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మండపం శిథిలమైంది కప్పు రాళ్లు పడిపోయాయి. నేలరాళ్ళు కుంగిపోయాయి నిధుల వేటగాళ్లు ఒక అంకణాన్ని కదిలించి లాభం లేక తమ ప్రయత్నాలు విరమించుకున్న ఆనవాళ్లు కల్పించాయి రెడ్డి గారికి  హరికృష్ణ గారు కల్పించుకుని ఈ మండపానికి గత వైభవ ప్రాభవాలను తేగలమా అన్నారు అది ఎంత పని నిధులు మీవి, విధులు మావి అన్నారు రెడ్డి గారు. రామకృష్ణ గారు  కొలతలు తీసుకొని సుమారు ఎంత అవుతుంది అనగానే దేశాంతర మండప జీర్ణోద్దరణ సుందరీ కరణకు అంగీకరించారు కొత్త ఆలయాల నిర్మాణం కంటే పాత వాటిని బాగుచేయమని హరిహర బుక్కరాయలకు విద్యారణ్య స్వామి చెప్పిన సంగతి గుర్తొచ్చింది రెడ్డి గారికి దేశాంతర మండపం దశ తిరుగుతున్నందుకు వారి కళ్ళల్లో ఆశల ఆనంద హేల కనిపించింది. అక్కడి నుంచి బయలుదేరి చంద్రగిరికి బయలుదేరారు కార్యక్రమం రెడ్డి గారికి అదే ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ పురాతన రాతప్రతులు కైఫియత్ లు సిద్ధయ్య మఠంలోని వేమన పద్యాల పరిస్కర్త ఒంటిమిట్ట దేవాలయం గ్రంథకర్త స్నేహశీలి పాత పుస్తక వనమాలి కట్టా నరసింహులు గారు గుర్తుకొచ్చారు. వారికి ఫోన్ చేస్తే రోడ్డు మీదకు వచ్చారు అన్నారు వస్తూ వస్తూ తెచ్చిన సిద్ధయ్య గారి మఠం వేమన పద్యాలు ఒంటిమిట్ట దేవాలయం పుస్తకాలని రెడ్డి గారికి హరికృష్ణ గారికి బివి రమణ గారికి ఇచ్చి ఆనందించారు ఆ తర్వాత వారంతా  కారు ఎక్కారు. సార్ ఇక్కడ దొంగల మండపం ఉండేది రెడ్డి గారు తిరుపతి శిల్ప కళాశాలలో చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి స్కెచ్ వేసే వారు. చుట్టూ ఇళ్లు రావడంతో రోడ్డు మీద నుంచి కనపడటం లేదు చూపిస్తారా అని అడిగారు రెడ్డి గారు.
అదెంత పని ఇక్కడేగా అని రెండు ఫర్లాంగుల దూరంలో లోపల ఆర ఫర్లాంగు దూరంలో రోడ్డుకు ఎడమ వైపున బిక్కుబిక్కుమంటున్న ఒక పెద్ద మండపాన్ని చూపించారు కట్టా నరసింహులు గారు స్థానికులు కొమ్ముగూడారు మంటపం చిక్కి సెల్యమయింది విరిగిన కప్పుల రాళ్లు జారిపడిన దూలాలు మండపం కృంగిపోయేసరికి ఒకరు కట్టెలమోపుల్ని  మరొకరు పశువుల మేతను నిల్వబెట్టుకున్నారు ఒకవైపు ఒక గోడ మరోవైపు రోడ్డు మిగిలిన రెండువైపులా ఏపుగా పెరిగిన గడ్డి పేరుకుపోయిన గాదం హృదయ విదారకంగా కనిపించిన దృశ్యాలు అదే దొంగల మండపం  దేశాంతర మండపంలాగే ఈ మండపం తిరుమల భక్తుల కోసం ఎవరో ఒక మహానుభావులు క్రీస్తు శకం 16 వ శతాబ్దంలో నిర్మించింది.


కామెంట్‌లు