అడుగుజాడల్లో ఆనవాళ్లు- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 వెయ్యేళ్ల పాటు వెలుగొందిన  బౌద్ధం నిషిద్ధ గీతమైందని ఒక కొత్త మతం ప్రజల అభిమాని కాదని మౌత్యాన్ని నూరి పోసింది శాంతిని కాంక్షించిన బౌద్ధం రెక్కలు తగిన పావురం అయింది. ఆగతాన్ని ఆహ్వానిస్తూ తిరుగు ప్రయాణం ముగించుకుని ఇంటికి చేరుకున్నారు రెడ్డి గారు.  విప్పర్ల శాసనం చేజర్ల చైత్యాలయం వారిని ముసురుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి  చరిత్రకు చారిత్రక ఆనవాళ్లకు మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా అనుకునే లోపు కంటికి కునుకు పట్టింది రెడ్డి గారికి. ఆరవ మజిలీ పూర్తి చేసుకున్నారు  ఈ యాత్రలో వారు పరిశీలించిన  ప్రతి అంగుళం చదువరులకు చక్కటి భాషా పటిమతో అందించారు  తర్వాత మజిలీ  ప్రయత్నంలో ఉన్నారు.
ఏడుస్తూ ఏడవ  యాత్రకు బయలుదేరుతున్నారు  ఏడుపు అంటే మనందరికి గుర్తొచ్చే అర్థం కంటి నిండా నీరు కారుస్తూ బోరున దుఃఖించే దృశ్యం కానీ గమనించండి ఓ చంటి పిల్లవాడు అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉంటాడు. వాడు వేసే తప్పతడుగులు తప్పి ప్రక్కకు పడిపోతాడేమో నన్ను భయంతో  మాతృమూర్తి  ఆ బిడ్డను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది  ఆ దృశ్యాన్ని చూస్తున్న  ఆమె భర్త  దినపత్రిక చదువుకుంటూ గమనించి  వాడి ఏడుపులు వాడు ఏడుస్తూ ఉంటే మధ్యలో నీ ఏడుపు ఏమిటి అంటాడు  కుర్రవాడు ఏడవడం లేదు భార్యా ఏడవడం లేదు అంటే ఆ కుర్రవాడు పడిపోకుండా జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు  ఒకవేళ పడిపోతే అతనిని పట్టుకోవడానికి  మాతృమూర్తి సిద్ధంగా ఉంది అన్న అర్థం లోనే ఆ పదాన్ని వాడతారు  ఇక్కడ కూడా శివ నాగిరెడ్డి గారు తన ప్రయత్నాన్ని పూర్తి చేయడానికి  ఏడవ మజిలీకి బయలుదేరబోతున్నారు.
సామాన్యంగా ఆంధ్రభాషలో ఉన్న  పరిణతి చెందిన పరిపూర్ణ  అర్థాలు మరొక భాషలో లేవు అని గర్వంగా చెప్పుకోవచ్చు  ఒక్కొక్క వాక్యంలో ఉన్న శబ్దాన్ని  చివరి అక్షరాన్ని అటు తిప్పిన ఇటు తిప్పిన  వేరు అర్థాలు వస్తాయి  విపరీతార్థం రావచ్చు వ్యతిరేక అర్థము రావచ్చు  అది మన భాష వైశిష్ట్యం  56 అక్షరాలతో ఉన్న ఆంధ్ర భాషను  సక్రమంగా వినియోగించుకున్న వారికి  కల్పవృక్షం  శివ నాగిరెడ్డి గారి శైలిని ఒకసారి పరిశీలించండి  ఆయన స్నేహితుడు  ఏర్పాటు చేసిన కూరల పద్ధతిని ఎలా వర్ణించారో  ఎంత చక్కటి పదాలతో కూర్చారో  ఆ గృహిణి గుత్తి వంకాయ కూరను  ఎంత కూరిమితో కూర్చి  వండిందో  వీరు కూడా వీరి యాత్రా విశేషాలను  అంత అందంగా కూర్చుతున్నారు  అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.


కామెంట్‌లు