చిక్కు విశ్వాసం- - యస్. వికాస్,-తరగతి:- 8వ Als,-TTWURJC (B) KONDAPUR,-నారాయణపేట్.
 అనగనగ ఒక ఊరిలో పేద వ్యక్తి ఉండే వాడు. ఆయన పేరు శివయ్య. శివయ్యకు భార్య ఉండేది. ఆమె పేరు లక్ష్మి. వాళ్ళకు సంతానం లేదు. ఎప్పుడూ వాళ్ళు సంతానం లేదని బాధ పడేవారు. శివయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని శివయ్య ముద్దుగా చిక్కు అని పిలిచేవాడు. శివయ్య ఆ గుర్రాన్ని ఊరిలో పెండ్లిళ్ళకి తీసుకోపోయేవాడు. ఆ పెండ్లి ఊరేగింపులో చిక్కు చాలా సహాయపడేది. అందుకు వారు శివయ్యకు కొంత డబ్బులు ఇచ్చేవారు.శివయ్య ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. శివయ్య చిక్కును తన కన్నబిడ్డ లాగా చూసేవాడు. గుర్రం కోసం పచ్చని గడ్డి తెప్పించేవాడు. రోజు గుర్రానికి స్నానం చేయించేవాడు. ఇలా ఆ గుర్రాన్ని అల్లారు ముద్దుగా పెంచేవాడు. ఇదంతా గ్రహించిన గుర్రం తన మనస్సులోఇలా అనుకుంటుంది. నా యజమాని నన్ను తన కన్నబిడ్డలా చూస్తాడు. నాకు ఎటువంటి ఆటంకం కలిపించకుండా పెంచుతున్నాడు. అందుకోసం నేను ఆయనకు గొప్ప పేరు తేవాలని బాధతో దేవుని వేడుకుంటుంది. అప్పుడు వెంటనే అక్కడ లక్ష్మిదేవి ప్రత్యక్షం అవుతుంది. నాయన చిక్కు నీ బాధలను నేను గమనించాను. నీకు నేను ఏ విధంగా సహాయపడగలను. అప్పుడు చిక్కు అమ్మా లక్ష్మీమాత నేను నా యజమాని కోసం గొప్ప పని చెయ్యాలి. అందుకని నీవు నాకు మాట్లాడడానికి, ఇంకా వేగంగా పరిగెత్తటానికి శక్తి నాకు ఇవ్వు, దీనితో వచ్చే నెలలో గుర్రాల పందెంలో పాల్గొని విజయం సాధిస్తాను. ఇంకా మా యజమాని భార్యకీ సంతానం కల్పించు అని వేడుకుంటుంది.
ఇది విన్న లక్ష్మీదేవి మూడు వరాలను  ఇచ్చి అదృశ్యమైపోతుంది. అప్పుడు చిక్కుతన యజమానిని, శివయ్యా... శివయ్యా అని పిలుస్తాడు. శివయ్య గుర్రం మాట్లాడిందానికి ఆశ్చర్యపోయాడు. చిక్కు జరిగిందం తా చెప్పుతాడు. ఇంకా శివయ్యతో, " ఈ నెలలో జరిగే గుర్రాలపందెంలో నేను కూడా పాల్గొంటాను. అని చెప్తాడు చిక్కు. పందెం జరిగే రోజు వచ్చింది. చిక్కు భలే ఆవేశంతో ఉన్నాడు. పందెం ప్రారంభం అయింది. గుర్రాలన్నీ పరిగెడుతున్నాయి. చిక్కు గుర్రాలన్నిటికన్నా రెండింతలు వేగంగా పరిగెత్తి విజయం సాధించాడు.
పందెంలో శివయ్యకు 10,000 రూపాయిలు బహుమనం ఇచ్చారు. శివయ్య ముఖంలో చిరునవ్వు కనిపించింది.

కామెంట్‌లు