తిరుప్పావై 8 వ పాశురము వరలక్ష్మి యనమండ్ర-అద్దంకి, బాపట్ల జిల్లా
కీళ్ వానమ్ వెళ్ళెన్టు ఎరుమై శిఱు వీడు మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్ పోవాన్ పొగిన్జారై ప్పోగామల్ కాత్తున్నై కూవువాన్ వన్దు నిన్హోమ్; కోదుకల ముడైయ పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పటై కొణ్డు మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ దేవాది దేవనైచ్చెన్టు నామ్ శేవిత్తాల్ ఆవా వెన్జారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.
***********
8వ పాశురం-భావం-పంచపదులలో
***********
ఎనిమిదవ రోజు పాశురము భావము

తూరుపు దిక్కుయు తెల్లబడెనుగా ఓ చెలీ 
పచ్చిక మేయగ పశువులు కదలెను ఓ చెలీ 
కృష్ణుని గుణగానము సేయగరావే ఓ చెలీ 
నిన్ను నిదుర లేపుటకే ఇటువస్తిమి ఓ చెలీ 
తెలవారే దాకా నీవేల నిదుర పోతువమ్మ.. లక్ష్మీ 

కేశి అనే రాక్షసుణ్ణి సంహరించెనుగ ఓ చెలీ 
ఆదిదేవుడు ఘనచరిత కలవాడు  ఓ చెలీ 
వ్రతమునాచరింప గోదాదేవి వెడలెనుగా చెలీ
సేవలు సేయగ నీవూ రావలెనే ఓ చెలీ
క్షేమమునడిగి మనము వరము పొందెదము.. లక్ష్మీ 

కృష్ణుని నుతి సేయగ బయలుదేరుదము ఓ చెలీ
నీవు లేక లోటుగ ఉండ ఇటు వచ్చితిమి ఓ చెలీ
కరుణించి కృష్ణుడు మనలను పాలించును చెలీ
వ్రతమునకు వాయిద్యములు కావలయును ఓ చెలీ
మనలను చూడగ స్వామి ఏమనునో ఓ చెలీ... లక్ష్మీ
***********


కామెంట్‌లు