తీరిన కోరిక - బండిపల్లి నిఖిల్ చరణ్, 9వ తరగతి, జడ్పిహెచ్ఎస్ ఇబ్రహీం నగర్ మండలం చిన్న కోడూర్, సిద్ధిపేట జిల్లా. సెల్ నెం.6300203158
 ఇబ్రహీం నగర్ అనే ఒక ఊరు కలదు. ఆ ఊరిలో ఒక పిల్లవాడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ పిల్లవాడి పేరు రాము. రాము వాళ్ళది చాలా పేద కుటుంబం.  తన తండ్రి పేరు రవి.  అడవిలోకి వెళ్లి కొన్ని కర్రలని తీసుకోవచ్చి ఆ కట్టెలని తెచ్చి చెక్కి చాలా బొమ్మలు తయారుచేస్తాడు. గ్రామంలోనూ, ఇతర ప్రదేశాలలో అమ్ముకునేవాడు.  రాము బడికి వెళ్లడానికి రోజూ మూడు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్లాలి. తన స్నేహితులు అందరూ సైకిల్ పై రోజు బడికి వెళ్తారు. ఒక రోజు రాము బడికి వెళ్తుండగా చాలా వర్షం కురుస్తుంది.  రాము వర్షంలో నడుచుకుంటూ వెళ్లే సరికి తన బట్టలు తడిసిపోతాయి. చలిలో గజగజ వణుకుతూ ఇంటికి వెళ్తాడు. జలుబు అయి జ్వరము వస్తుంది. మరసటి రోజు తన తల్లి సుమతో "అమ్మా నాకు ఒక సైకిల్ కావాలి. నేను అంత దూరం వెళ్లలేక పోతున్నాను. వర్షంలో తడుస్తున్నాను. తడిస్తే జ్వరం వస్తుంది. ఎండకు వడదెబ్బ తలుగుతుంది. నాకు ఒక సైకిల్ కొనివ్వమని" నాన్నతో చెప్పుమన్నాడు. 
అప్పుడు సుమ రాము మీ నాన్న బొమ్మలు అమ్మే డబ్బులు ఇంటి సరుకులకు సరిపోతుంది. నా దగ్గర అన్ని డబ్బులు లేవు" అంటుంది సుమ. ఏం చేస్తే తన కుటుంబ పరిస్థితి ఆర్థికంగా మెరుగు పడుతుందో ఆలోచించాడు. కరోనా కాలంలో చదువు కోసం కొన్న ఫోన్ యూట్యూబ్లో బొమ్మలు ఎలా తయారు చేయాలి అని సెర్చ్ చేసి బొమ్మల్ని కొత్తగా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు.
 తెలుసుకున్న విషయాన్ని తన నాన్నతో చెప్పాడు. ఇద్దరు కలిసి కొన్ని వెరైటీ బొమ్మలు చేసి గ్రామంలో, పట్టణంలో, వివిధ దేవాలయాలలలో తీర్థాలలో, జాతరలలో అమ్మారు. వీరి బొమ్మలకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. 
ఒకరోజు రాము వాళ్ళ నాన్న రాముతో "నీకేం కావాలి" అని అడిగాడు. 
"మన ఆర్థిక పరిస్థితి బాగయ్యాక నాకు సైకిల్ కొనిస్తాను అని అన్నావు నాన్న. ఇప్పుడు సైకిల్ కొను నాన్న" అని రాము అన్నాడు. 
వెంటనే "ఓకే నాన్న తప్పకుండా కొనిస్తాను. నీ ఆలోచనలు, ఇంకా మెరుగవ్వాలి. ఆర్థికంగా ఎదగాలి అనేకమందికి నీ ఒక మార్గదర్శిని కావాలి" అని చెప్పి తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనిచ్చారు.
 ఈ కథలో నీతి కోరిక తీరలేదని, తీరదని బాధపడటం కంటే ఎలా తీరుతుందో ఆలోచిస్తే తప్పకుండా అసాధ్యం అన్నది సుసాధ్యం అవుతుంది.


కామెంట్‌లు
Dr. Siddenky Yadagiri చెప్పారు…
మంచి కథ
నిఖిల్ కి అభినందనలు