సాయం కథ;- బి. నిఖిల్ చరణ్- 9వ తరగతి- Zphs ఇబ్రహీం నగర్ జిల్లా సిద్దిపేట-Cell. 6300203158
 అనగనగా ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను బిక్షం అడుక్కునేవాడు. దారిన పోయిన వాళ్లంతా అతన్ని చూస్తారే కానీ ఒక్కరు కూడా బిక్షం వెయ్యరు. అలా ఆ రోజంతా అక్కడే కూర్చుంటాడు. రోజులు గడుస్తాయి కానీ అతనికి భిక్షం ఒకటి లేదా రెండు రూపాయలు వస్తాయి. ఒకరోజు ఒక ఆయన బిక్షం వేస్తుండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు పక్కనున్న దుకాణానికి వెళ్లి బరువు  తనిఖీ యంత్రం కొని ఆ బిక్షగాడికి ఇస్తాడు. అప్పుడు అక్కడికి అందరూ వచ్చి వాళ్ళ బరువు తెలుసుకొని కొన్ని డబ్బులు వేస్తారు అలా కొన్ని రోజుల తర్వాత ఆ బిక్షగాడు ఒక కాపీ షాప్ పెట్టుకుంటాడు. అక్కడికి బరువు తనిఖీ కొనిచ్చినతను వస్తాడు. బరువు తనిఖీ కొనిచ్చిన అతను డబ్బులు ఇస్తుంటే వద్దంటాడు. బిచ్చగాడు అంటాడు మీరు కనుక నాకు బరువు తనిఖీ యంత్రం కొనివ్వకపోతే నేను ఈ స్థానంలోనే  ఉండేవాన్ని కాదు. ధన్యవాదాలు అని చెప్పుతాడు. బరువు తనిఖీ కొనిచ్చిన అతను  అంటాడు. నువ్వు ఇలా డబ్బులు ఇవ్వకుండా వాళ్లకు ఏదైనా అవసరమైన వస్తువు కొనివ్వు అని అంటాడు. 
తప్పకుండా సార్. మీరు నాకు సహాయం చేసినట్లే నేను ఇతరులకు సాయం చేసి వారిని ఎవరిపై ఆధారపడకుండా జీవించేలా కృషి చేస్తాను' అని హామీ ఇస్తాడు.

కామెంట్‌లు