శ్రమజీవులు- కె.ఉమామహేశ్వరి- 9వ.తరగతి - బి.విభాగము- తెలంగాణఏకలవ్య ఆదర్శ గురుకులపాఠశాల బయ్యారం/నామాలపాడు
 01.
తే.గీ.
గడ్డపారలుపట్టియుకష్టమనక
గుండురాళ్లనుగొట్టిరిగుట్టలందు
కట్టగపునాది,గోడలుగట్టిగాను
వడ్డెవారలుజేయునుదొడ్డపనులు!!!

02.
తే.గీ.
కర్రపనిజేయువడ్రంగికష్టపడియు
నిండ్లతలుపులు,కిటికీలనింపుతోడ
కర్రకుర్చీలు,బల్లలుఘనముగాను
ప్రజలపనులకునుపయోగపడిరివారు!!!




కామెంట్‌లు