సృష్టికి మూలం అమ్మ;- భానుతేజ -పదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్ -మెదక్ జిల్లా93919 92070
 అమితమైన ప్రేమ అమ్మ
అంతులేని అనురాగం అమ్మ 
అలుపెరుగని ఓర్పు అమ్మ 
అద్భుతమైన స్నేహం అమ్మ 
అపురూపమైన కావ్యం అమ్మ 
అరుదైన రూపం అమ్మ 
అమ్మ ప్రేమ చల్లనైనది 
అమ్మ ప్రేమ కమ్మనైనది 
అమ్మ రూపం అపురూపమైనది 
అమ్మ దీవెన దివ్యమైనది 
అమ్మ మనసు స్వచ్ఛమైనది 
అమ్మ ఆకాంక్ష ఎనలేనిది 
అమ్మ ఋణం తీర్చలేనిది 
బుడిబుడి అడుగులకు ఆసరా అమ్మ 
తడబడే అడుగుల సవరణ అమ్మ 
మాకు జన్మనిచ్చిన అమ్మ 
మానవ సృష్టికి ప్రతిబింబం అమ్మ

కామెంట్‌లు