హరివిల్లు రచనలు ;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 566
🦚🦚🦚🦚
నిశ్చల తపో దీక్షకు
వరాలు వశమౌతాయి.....!
మత్తు గమ్మత్తులకు
వ్యధలు చేరువౌతాయి......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 567
🦚🦚🦚🦚
ఎవరికైనా తప్పులు
దొర్లడం సర్వ సహజం....!
కారణాలు తెలుసుకొనక
మెదలడమే అసహజం..!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 568
🦚🦚🦚🦚
*ఉచితమే(మో) కానీ*
స్త్రీలు బస్సుల్లో *ఉచిత* ప్రయాణాలకై! పరుగులు
ప్రభుత్వ బడిలో చదువు
ఉచితమే! వెనుకడుగులు
🦚🦚🦚🦚
హరివిల్లు 569
🦚🦚🦚🦚
మన మేధో సంపత్తి
అధ్భుత జ్ఞాపక శక్తి ......!
లేని పోని వాటి పట్ల
ఉండకూడదు అనురక్తి.!!
🦚🦚🦚🦚
హరివిల్లు 570
🦚🦚🦚🦚
దుఃఖము శాశ్వతమని
కృంగిపోవుట తలపోటు.!
సుఖం శాశ్వత సుఖమని
భ్రమించుటే పొరపాటు..!!
           (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు