సీతాకోకచిలుకలు (బాలగేయం)- రావిపల్లి వాసుదేవరావు-విజయనగరం-9441713136
రంగుల సీతాకోకలు
రయ్యిమని వచ్చాయి!
పూవులపైన వాలీ
మకరందం తాగాయి!

పువ్వు పువ్వును మార్చి
పలకరించి పోయాయి!
కొమ్మ కొమ్మకు ఎగిరీ
పరవసించి పోయాయి!

రంగుల దేహం కలిగి
ముచ్చటగా ఉన్నాయి!
మొక్కలతో జత కలిసి
ముచ్చట్లే ఆడాయి!

గాలిలో అటు ఇటూ
చక్కర్లు కొట్టాయి!
పైకీ కిందకూ కదిలి
ఆనందం పొందాయి!

వాటిని చూసిన బాలలు
కేరింతలు కొట్టారు!
సంతోషంతో వారు
గంతులేసి ఆడారు!

కామెంట్‌లు