నేస్తం , బాలగేయం;- రావిపల్లి వాసుదేవరావు-విజయనగరం జిల్లా-9441713136
కలువకు చంద్రుడు నేస్తం 
కమలానికి రవి నేస్తం
అనురాగం పంచేటి 
అమ్మే అందరి నేస్తం

చెల్లికి అక్కయ్య నేస్తం
తమ్ముకు అన్నయ్య నేస్తం
నడతను నేర్పంచేటి
నాన్నే అందరి నేస్తం

వాగు నదికీ నేస్తం
నదికి కడలే నేస్తం
పూలు పండ్లు ఇచ్చేటి
తరువే అందరి నేస్తం

మల్లికి పందిరి నేస్తం
మనసుకు మమతే నేస్తం
మంచితనం కలిగిఉన్న
గుణమే అందరి నేస్తం

పొలముకు రైతే నేస్తం
రైతే పొలముకు నేస్తం
పంటలను పండించే
రైతే అందరి నేస్తం

కామెంట్‌లు