చలువరేడు (బాలగేయం );- రావిపల్లి వాసుదేవరావువిజయనగరం జిల్లా9441713136
అందాల చందమామ!
అందరిది చందమామ!
వెలుగులను పూయించే
చలువరేడు ఈ మామ!!

కళలు గల చందమామ!
వెన్నెలిచ్చు చందమామ!
పిల్లలంత కోరుకొనే
నేస్తం కద ఈ మామ!!

సొగసరి కద చందమామ!
గడుసరి కద చలువమామ!
అందరాని చందమామ
అందె నేడు ఈ మామ!!

చుక్కలరేడు ఈ మామ!
చక్కనోడు ఈ మామా!
రేయిని తన కాంతులతో
వెలిగించును ఈ మామా!!

కామెంట్‌లు