హిడింబి;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 అప్పుడు కుంతీ సుందరి నీవెవరో ఎక్కడి నుంచి వచ్చావు అని అడగగా ఆ హిడింబి జరిగిన వృత్తాంతమంతా కుంతితో చెప్పింది  వెంటనే పాండవులందరూ ఆ పోరాటస్థలానికి వెళ్లగా అర్జునుడు సోదరా భయం ఏమి లేదు వాడిని నాకు విడిచిపెట్టు కానీ భీముడు అందుకు ఒప్పుకోకుండా తుఫాన్ లాగా చెలరేగి పైకెత్తి అనేకసార్లు గిరగిరా తిప్పి నేలపై విసిరి కొట్టాడు భీముని చేతిలో మరణించాడు. ఆ తర్వాత పాండవుల ముందుకు సాగారు హిడింబి కూడా వారిని అనుసరించే నడుస్తోంది విడుంబి కుంతితో ఇలా అన్నది అమ్మ నేను త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నాను నాపై దయ చూపండి నన్ను విశించండి నేను మీకు భవిష్యత్తులో ఉపయోగపడగలను మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళగలరు మీరు  నన్ను స్వీకరించకపోతే నాకు మరణమే శరణ్యము అన్నది.
అప్పుడు ధర్మరాజు ఓ హిడింబీ నీవు నీ వరకు చెప్పుచున్నదంతా ఉచితముగానే ఉన్నది సత్యమును ఎల్లప్పుడూ ఉల్లంగించ రాదు నీవు ప్రతిదినము సూర్యాస్తమయములకు పూర్వము నీవు పవిత్రమై భీమసేన సేవలో  ఉండవచ్చును అన్నాడు. అప్పుడు భీమసేనుడు నేను హిడింబితో సంతానం కలిగే వరకే ఉంటాను ఆ తర్వాత ఉండను అన్నాడు అన్ని షరతులను అంగీకరించడంతో హిడింబి దివ్య వేషధారణై సకలాలంకార శోభితయై ఆకాశమార్గంలో భీముని తీసుకొని మధురంగా మాట్లాడుతూ పర్వత శిఖరాగ్రాలతో దట్టమైన అడవులలోని గుహలలో, నగరాలలో దివ్యమైన భూములలో విహరింప సాగింది. సమయమాసన్నము కాగా విళంబి కి ఒక పుత్రుడు జన్మించాడు అపరిమితమైన శక్తితో అనేక మాయలతో కొద్దికాలంలోనే యువకుడై సర్వ అస్త్రవిద్యల్లో ఆరి తేరిన వాడైనాడు.

కామెంట్‌లు