కుంతి- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 అపరిమితమైన శక్తితో అనేక మాయలతో కొద్ది కాలంలోనే యువకుడై సర్వాస్త్రవిద్యల్లో ఆరితేరిన వాడైనాడు అతని శిరస్సుపై వెంట్రుకలు లేవు కనుక ఘట అనే బిరుదుతో ఘటోత్కచుడు అనే పేరు పెట్టారు అతడు  తల్లిదండ్రులపైనే కాక పాండవులందరిపై అపార ప్రేమ కలిగి ఉండేవాడు వారి ఉద్దేశించి ఘటోత్కచుడు మీరు నాకు పూజనీయులు మీరు ఏమి సేవ చేయాలో ఆదేశించండి  అని అన్నాడు అప్పుడు కుంతీ నాయనా నీవు కురువంశం సంతానానికి భీమసేనుడు అంతటి వాడివి సమయం వచ్చినప్పుడు సాయం చెయ్ అన్నది నానమ్మ నేను రావణుడు ఇంద్రజిత్తు అంతటి సమానమైన బలశాలిని విషయాలకై మీరు నన్ను స్మరిస్తే చాలు నేను మీ ఎదుట వాలగలను అని చెప్పి ఘటోత్కచుడు మాయమైపోయాడు.
ఇంతలో వేద వ్యాసుడు వచ్చి ఈ దగ్గరలో ఉన్న ఒక నగరంలో తల దాచుకోండి మీకు అంతా శుభమే జరుగుతుంది మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు చెప్పిన విధంగానే పాండవులు ఏకచక్ర పురానికి వెళ్లి ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఉండడం జరిగింది యాజక వృత్తినే స్వీకరించి  అందరు తెచ్చిన బైక్ సగం భీమునికి మిగిలిన సగం మిగతా అందరూ కలిపి తినేవారు  ఒకరోజు అందరూ బయటకు వెళ్లారు ఆరోజు కొంచెం సేపట్లో ఆ బ్రాహ్మణుల ఇంట్లో ఆర్తనాదాలు వినిపించాయి. కుంతికి ఒక చిత్రమైన విషయం బయటపడింది ఆ ఊరికి పట్టిన శని ఏమంటే బకాసురుడు  అనే రాక్షసుడు ఆ ఊరిపై పడి ప్రజలను చంపసాగాడు. అందుకు ఊరి ప్రజలంతా అరాక్షసుడుతో కోపం కుదుర్చుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ప్రతిరోజు ఒక బండెడు అన్నం ఒక మనిషిని ఆహారంగా పంపాలి ఆరోజు ఆ బ్రాహ్మణుల వంతు వచ్చింది కనుక ఆ ఇంటిలోని వారందరూ బోరున ఏడుస్తున్నారు  భారతాన్ని అనువదిస్తూ  తిక్కన సోమయాజి గారు  అద్భుతమైన నాటకీయతను మనకు తెలియజేశారు  ముందు తండ్రి  నేను ఈ కుటుంబానికి సంరక్షకుని గనుక  ఆ రాక్షసులకు ఇవాళ నేను ఆహారంగా వెళతాను  అంటే  అద్భుతమైన పదజాలం ఉపయోగించింది గృహిణి పడిన ఆ మిషము  భంగి  అని  ఒక మాంసపు ముక్క  భూమి మీద పడితే దానికోసం  జంతువులు పక్షులు ఎలా చుట్టుముట్టి  దానిని తినాలని చూస్తాయో  అలా భర్త లేని స్త్రీని చులకనగా చూస్తారు కనుక నేను వెళతాను అన్నది  ఆ పతివ్రత.
కామెంట్‌లు