కుంతి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322

 అప్పుడు కుమార్తె  నాన్నగారు మీరేమీ బాధపడకండి  ఇవాళ కాకపోతే రేపు అయినా నన్ను మరొక ఇంటికి  పంపిస్తారు కదా అది ఈ రోజే చేయండి నా తల్లిదండ్రుల రుణాన్ని ఈ విధంగానైనా తీర్చుకుంటాను  అనే సరికి  అ ఆలు మగల  మనసులు  వికలమైనవి అప్పుడు చంటి కుర్రవాడు లేచి  మీరు ఎవరూ అవసరం లేదు నేనొక్కడినే వెళుతున్నాను అని  వాడి దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని  ఈ కత్తితో వాడిని చంపి తిరిగి వస్తాను  అనేసరికి ఆ తల్లిదండ్రులకు  ఆనందించాలో దుఖించాలో తెలియని స్థితి  పద్యాలలో కూడా అందమైన నాటకీయత చూయించిన అద్భుతమైన కవి  మన కవిత్రయంలో ద్వితీయుడు తిక్కన సోమయాజి  వారు అనువదించిన ప్రతి అక్షరాన్ని మనం మరువలేం  అది వారి ఘనత.అప్పుడు కుంతి వారికి ధైర్యం చెప్పి ఈ రోజు నా కొడుకు భీముడు వెళతాడు మీరేమీ భయపడకండి అని ఊరడించింది అనుకున్న రీతిలోనే భీముడు రాక్షసునకు ఆహారం తీసుకొని వెళ్ళాడు  బకాసురా బకాసురా అని పిలవ సాగాడు భీముడు గొప్ప శరీరం కలవాడే కాకుండా వేగవంతుడు అయిన వాడు ఆ  బకాసురుడు భయంకరంగా కనిపిస్తున్నాడు. తనకోసం తెచ్చిన ఆహారాన్ని భీముడు తినడం చూసిన బకాసురుడు తీవ్రంగా చరిచాడు అయినా కూడా భీముడు తింటూనే ఉన్నాడు. రెచ్చిపోయిన బకాసురుడు దగ్గరలో నున్న ఒక చెట్టు పెరికి తెచ్చి భీముడిని మోదలనే తలంపుతో ఉండగా భీముడు దాన్ని ఒడిసి పట్టుకొని మరొక చెట్టును పెరికాడు ఆ విధంగా ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధానికి  సమయమును గమనించి బకాసురుడు పరిగెత్తుకొని భూమిని ఒడిసి పెట్టుకున్నాడు అప్పుడు భీముడు వాడిని తన చేతుల్లోకి తీసుకొని ఎలాగటం మొదలు పెట్టాడు.
చివరకు బకాసురుడు అలిసిపోయాక 
నేల కేసి బాది నడుమును విరగగొట్టాడు బకాసురుడి నినోటి నుంచి రక్తం కారగా అచేతనుడై ప్రాణ వదిలాడు బకాసురుని కేకలు విన్న  వారి పరివార రాక్షస సమూహం సేవకులతో పాటు బయటకు వచ్చారు భీమసేనుడు వారినందర్నీ మానవుల జోలికి రావద్దని శాసించాడు వారు అలాగే శిరసావహించారు ఈ కారణంగా ఏక చక్ర పుర వాసులందరూ ఎంతో సంతోషించి పాండవులకు బ్రహ్మరథం పట్టారు. ఘటోత్కచుని యుద్ధం గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఆ విషయాన్ని తెలుసుకుందాం  మై రావణుడు మరణించిన దృశ్యాన్ని చూసిన ఘటోత్కచుడు భీకరంగా గర్జించాడు. ఆ గర్జన ప్రభావానికి పర్వతాలు వణికాయి సముద్రాలు శబ్ధ తరంగాలు అయ్యాయి. ఆకాశం దిశలు ప్రతిధ్వనించాయి భూమి కదిలిపోయింది.

కామెంట్‌లు