ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఫోన్ రాగానే  నేను సుమన్  రికార్డ్ చేయడానికి ఇంజనీర్  ముగ్గురం కలిసి ఉండే వాళ్ళం  సుమన్ ను  ప్రశ్నలు అడుగు  నేను రికార్డ్ చేస్తాను అంటే  నేను మాట్లాడే పద్ధతి కొంచెం మోటుగా ఉంటుంది వారికి కోపం కూడా రావచ్చు  నీలాగా సున్నితంగా మాట్లాడటం నాకు చేతకాదు  కనుక నీవు అడుగు నేను  నీవు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాను అనడంతో కార్యక్రమాలు ప్రారంభమైనవి ఒక అక్కని పిలవడం మమ్మల్ని పరిచయం చేయడం కానిస్టేబుల్ పని నేను ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన  నిజ జీవితంలో జరిగిన కథని చెప్పడం నాకు కళ్ళ నీళ్లు వచ్చినా ఆపుకోక తప్పని పరిస్థితి  నిజంగా సానుభూతి ఉన్నా అది చూపడానికి వీలు లేదు  ఆ సందిగ్ధ అవస్థలో ఆ కార్యక్రమాలు ఆరు సంవత్సరాలు చేశాం. ఒకరోజు కానిస్టేబుల్ సుజాత అన్న మహిళను తీసుకువచ్చాడు  నేను ప్రశ్నలు మొదలు పెడుతూ మీరు ఈ వృత్తిలోకి రావడానికి కారణం ఏమిటి అమ్మ అని అడిగితే  ఏ వృత్తి అండి అంది. అంతలో ఆమెను పోలీసులు కొట్టి తిట్టి  సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తే మేము అడ్డగించి విషయం చెప్పమంటే ఆవిడ కథను చెప్పింది. మా ఆయన లారీ డ్రైవర్ అండి  నిన్న బొంబాయి వెళ్లారు ఆరు రోజుల వరకు ఆయన రారు మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడు  త్వరగా నన్ను ఇంటికి పంపించండి అని ఏడ్చింది  తీరా విచారిస్తే  అంతకు ముందు వీరు ఉన్న ఇల్లు వేశ్యాగృహం  వాళ్లు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత వచ్చారు  వాళ్లే వీళ్ళని  కానిస్టేబుల్ ఆమెను తీసుకొచ్చాడు నేరం చేసిన వాళ్ళని శిక్షించవచ్చు నేరం చేయకుండా శిక్ష అనుభవిస్తే ఆమె మానసిక స్థితి ఏమిటో  ప్రత్యక్షంగా తెలుసుకున్నాను.
అలాంటి జీవిత సత్యాలను తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు  డాక్టర్ బాలాంతరపు రజనీకాంత్ రావు గారు  అభినందనీయులు  ఈ గృహిణి విషయం తెలిసి రజిని గారు ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు నన్ను పిలిచి ఈ కార్యక్రమము నీకు ఎందుకు అప్పగించానో తెలిసిందా  అని అడిగి నేను సమాధానం చెప్పేటప్పుటికే ప్రపంచ ప్రఖ్యాత నవలాకారుడు మాక్సిమ్ గోర్కి  క్రైమ్ అండ్ పనిష్మెంట్ నేరము శిక్ష నవల చదివావా  నేరం ఎన్ని రకాలు ఏ నేరానికి ఏ శిక్ష విధించాడు దానికి చక్కటి మానసిక విశ్లేషణ అద్భుతంగా వ్రాశారు కానీ  ఇక్కడ మీకు ఎదురైన సమస్య దానికి విరుద్ధమైన అనుభవం  ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది గోర్కీ మహాసేయుడైతే ఈ విషయాన్ని గురించి అద్భుతమైన మరో నవలను సృష్టించగలరు అన్నారు రజినీ గారు.


కామెంట్‌లు