కుంతి;-ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 యయాతి తన ముసలితనాన్ని పురుకు ఇచ్చి అతని యవ్వనాన్ని అనుగ్రహించాడు ఆ తర్వాత అనేక సంవత్సరాలు భోగములను అనుభవించి చివరకు వాస్తవాన్ని గ్రహించి తన యవ్వనాన్ని పురుగు ఇచ్చి తన ముసలితనాన్ని తాను తీసుకుని రాజ్యాన్ని పురుకు అప్పగించి అడవులకు వెళ్లిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి స్వర్గ ప్రాప్తి లభించింది అక్కడ ఇంద్రునితో జరిగిన సంభాషణలో ఒక అహం ప్రకటితమై భూలోకమునకు నెట్టి వేయబడ్డాడు వెంటనే యయాతి ప్రార్థన మేరకు జ్ఞానుల మధ్య ఆగిపోయాడు జ్ఞానులైన అష్టకుడు  ప్రతానుడు వసుమన్ శిబా యయాతితో సమానం చేశారు ఆ కారణంగా అందరూ కూడా స్వర్గానికి చేరారు. వ్యాసుల వారు భారతం చదివితే  ఈ ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా ఉందో  ఇట్టే తెలిసిపోతుంది  వారి దివ్య దృష్టి అలాంటిది  మన పెద్దలు చెప్పే ఒకే ఒక మాట వ్యాసుల వారు వ్రాసిన భారతంలో లేనిది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు  భారతంలో ఉన్న ప్రతి  విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అని  అయితే  కాలానుగుణంగా కొన్ని పేర్లు  మార్పు చెంది ఉండవచ్చు  పాతివ్రత్య ధర్మాన్ని గురించి చెప్పడం కోసం ప్రత్యేకంగా  స్త్రీ లక్షణాలు ఎలా ఉండాలి  ఏ రకం స్త్రీ ఎలా ప్రవర్తిస్తుంది  ఉత్తమ గృహిణిగా పేరు పొందడానికి ఆమె చేయవలసిన  బాధ్యతలు ఏమి ఉన్నాయి  ఇంటిని చూడు ఇల్లాలిని చూడు  అన్న నానుడి  ఎలా వచ్చిందో  తెలుసుకోవాలనుకుంటే వ్యాసుల వారు వ్రాసిన ప్రతి స్త్రీ చరిత్ర చదివితీరవలసినదే  అప్పుడు గాని వాస్తవం అర్థం కాదు అంటారు పెద్దలు.
అయితే భారతదేశంలో  ఆదికవిగా పేరుపొందిన వాల్మీకి మహర్షి వ్రాసిన  రామాయణం చదివితే  ఎన్ని ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయో చెప్పలేం రామ ఆయణం రాముడు చుట్టూ తిరిగేది  రమా ఆయణం సీత చుట్టూ తిరిగేది  అంటే లక్ష్మీదేవి  అని  శబ్దార్థం  కానీ జటాయువుతో  ప్రారంభించి త్రిజటతో ముగుస్తుంది  అంటే సామవేదంతో ప్రారంభమై దానిని  వేద త్రయిగా  మార్చడమే రామాయణం  రమః అంటే  రమించు వాడు అని అర్థం  తన సుఖం ఎలా ఉంటుందో ఇతరుల సుఖం కూడా అలాగే ఉంటుంది ఉండాలి అని భావించేవాడు శ్రీరామచంద్రమూర్తి  మాటకోసం ప్రాణాలనుఇచ్చే తత్వం  తండ్రి కోరికను  అక్షరాలా పాటించిన వాడు మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి  కనుకనే ఏ చిన్న పల్లెకు వెళ్ళినా రామాలయం తప్పక ఉంటుంది  వారికి నిత్య  నైమిత్తిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి  ఆ ఆదికవి వ్రాసిన కొంతమంది పతివ్రతా శిరోమణుల జీవితాలను పరిశీలిద్దాం.

కామెంట్‌లు