జానకి- ఏ.బి ఆనంద్,=ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,=9492811322

 వ్యాసమహర్షి  న్యాయాన్ని గురించి మహాభారతంలో తెలియజేస్తే ఆదికవి వాల్మీకి మహర్షి  దేశానికి నడత నడక  చెప్పిన మహర్షి  వారు పెట్టిన ప్రతి పేరుకు ఆ పాత్ర లక్షణాలన్నీ కనిపిస్తూనే ఉంటాయి రామాయణం శ్రీ రామచంద్రుని పాత్రను చూస్తే నడక నడత రెండు ఎలా ఉంటాయో  తెలియజేస్తున్నాడు  శ్రీరామచంద్రులకు రక్షణగా వెళుతున్న  లక్ష్మణ స్వామికి తన తల్లి సుమిత్ర  కుమారునికి  బాధ్యతలను గురించి తెలియజేస్తుంది  నీవు అన్న రక్షణ కోసం ఇంటి నుంచి వెళుతున్నావు  పొరపాటున కూడా అతని నడకలు చూడవద్దు  అన్న నడతలో  స్త్రీలను కూడా వశపరుచుకునే సొగసు కనిపిస్తుంది  ఆ నడకను చూస్తే ప్రతి స్త్రీ సమ్మోహితురాలు కాక తప్పదు  నీవు ఆ నడక చూస్తే  నీ బాధ్యతను మర్చిపోయి  మైమరచిపోతావ్ కనుక  ఆ పని చేయవద్దు అని చెబుతూ అన్న నడతను  పరిశీలనగా చూడు  అన్న చేసిన ప్రతి పని ధర్మబద్ధమై  ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది  దానిని అనుసరించు అంటుంది  దశరథునికి ముగ్గురు భార్యలు పెద్ద భార్య కౌసల్య ఎవరితో ఎలా మాట్లాడాలో దేశ ప్రజల క్షేమం కోసం సంక్షేమం కోసం ఎలాంటి పద్ధతులు అవలంబించాలో ఆ రహస్యాలన్నీ తెలిసి వాటిని అమలుపరిచే శక్తి కలిగిన స్త్రీగా ఆమె పేరు మనకు కనిపిస్తుంది  అలాగే రెండవ భార్య సుమిత్ర  ఎవరిని నొప్పించకుండా తన పని కావడం కోసం ఎలా వ్యవహరించాలో తెలిసి అందరితోనూ మైత్రిని సమకూర్చగలిగిన ధైర్యవంతురాలు  ఇక చిన్న భార్య కైకేయ(క+ ఏక) తాను తప్ప మరొకరు లేరు ప్రేమను పంచడంలో కానీ పెంచడంలో కానీ తనకు ఎదురు ఉండకూడదు  నాతో పోల్చబడే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండకూడదు  అన్న తత్వానికి ప్రతీక.
భార్య ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి ఒక్క తార చెప్పిన మాట వింటే  వాల్మీకి మహర్షి ఎంత సున్నితంగా విషయాలను చెప్పగలరో మనకు అర్థం అవుతుంది  సుగ్రీవుడు వచ్చి  నాతో యుద్ధం చేయడానికి రా అని  ఇంటి ముందు కేకలు పెడుతున్నప్పుడు వాలి భార్య   నాథా నిన్న ఓడిపోయి తన్నులు తిన్న తమ్ముడు ఇవాళ వచ్చాడు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది  మీరు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని సలహా  ఇవ్వడాన్ని గమనిస్తే  ఆడది అబల కాదు సబల  పురుషులతో సమానమైన  బలశాలి  కరణేషు మంత్రి  అని చెప్పిన సూక్తి  ఆమె పట్ల నిజం చేశారు వాల్మీకి మహర్షి  వాలి అంటేనే వాలములు పెరిగిన వాడు  గర్వపోతు  సుగ్రీవుడు అంటే మంచి కంఠము కలిగిన వాడు ఎలా మాట్లాడాలో తెలుసు ఇలా ప్రతిపాత్ర పేరులోనే అతని  శీల సంపద మనకు అర్థమయ్యేలా చెప్పారు వాల్మీకి మహర్షి  అందుకే ఆ విషయాలను తెలుసుకోవడానికి రేపటి నుంచి ప్రయత్నం చేద్దాం.
కామెంట్‌లు