ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 కొత్త రామకోటయ్య గారు యోగాలో సత్తా ఉన్న మనిషి అని  నాన్నగారికి చెబితే విశాఖపట్నంలో నివాసం ఉన్న వారిని కలిశాను. ఆయన అరవిందుల ఆశ్రమంలో ఉండి యోగ శాస్త్రాన్ని రాశారు అరవిందులు రచించిన సావిత్రి నాటకాన్ని తెలుగులో అనువదించారు అది అరవిందుల వారి రచనకు చాలా దగ్గరగా వచ్చింది  మా కేంద్రంలో పనిచేస్తున్న కొంతమంది ఆడపిల్లలు వారిని పరిచయం చేయమంటే తీసుకువెళ్లి  వారిని పరిచయం చేశాను  ఆయనతో యోగ ఎలా చేయాలో చూపండి అంటే ఆయన  పిల్లలుకు తరిఫీదు కూడా ఇచ్చారు వారంతా చాలా ఆనందించారు నిజ జీవితంలో అనుసరించారు కూడా  దానితో పిల్లలకు బాగా  అలవాటై అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం  అరవింద ఆశ్రమంలో అనేక విషయాలను వారు మాకు తెలియజేసే వారు. ఒక పర్యాయం నాన్నగారు విశాఖపట్నం వస్తే వారిని తీసుకొని  రామకోటయ్య గారి దగ్గరికి వెళ్లి పరిచయం చేశాను  నాన్నగారికి కూడా యోగాలో మంచి అనుభవం ఉన్నది కనుక గాలి పూరించడం మళ్ళీ వదలడం  అనేక  విషయాలు చర్చించుకున్నారు  తర్వాత వారు రాసిన సావిత్రి నాటకాన్ని  చదివిన నాన్నగారు కొన్ని విమర్శలు చేశారు  సవితతో కూడినది సావిత్రి అన్నప్పుడు  కటికి చీకటిలో కూడా వెళ్ళగలిగిన  సామర్థ్యం కలిగి ఉన్నది  అనే కదా అర్థం  మీరు ప్రత్యేకంగా పాతివ్రత్య మహిమ చేత అని వ్రాయడం  ఏమిటి అని అడిగితే  అది అరవిందుల వారు రాసిన దానికి అనువాదం తప్ప నా సొంతం కాదు  అని  జవాబును దాటవేశారు  అలాంటి పెద్దవారితో  కలిసి ఉండడం చాలా ఆనందం అనిపించింది నాకు. 1990 జనవరి 31వ తేదీ నేను గుర్తు పెట్టుకోవలసిన రోజు  ఆరోజు నేను రెండు నాటికలు చేసి ఆ హడావుడిలో ఉన్నాను మా డ్యూటీ ఆఫీసర్ గారికి( మా గురువుగారు ఉషశ్రీ గారు కాదు ఈమె స్త్రీ) డీటెయిల్స్ ఇస్తున్నాను అప్పుడే నా వెనక్కి నిలబడ్డాడు సత్య మూర్తి  మిమ్మల్ని ఎవరు రానిచ్చారు మీరు బయటికి వెళ్లిపోండి దయచేసి  అని బ్రతిమలాడింది  నేను ఒక కాగితం ఇవ్వడానికి వచ్చానమ్మా అని ఎంతో గౌరవంగా చెప్పారు  నేను తీసుకోవడానికి తగిన దానిని కాదు స్టేషన్ డైరెక్టర్ రావాలి ఆయన వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పి పంపింది నేను వారిని మా ఇంటికి తీసుకువెళ్లేను  వెంటనే నా వెనకే ప్యూర్ ని పంపించి  ఆయనను వెంటనే పంపించేయండి దయచేసి  లేకపోతే చాలా తగాదాలు అవుతాయి అని హెచ్చరించిందికామెంట్‌లు