ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 
మొదట సంభవామి యుగేయుగే నాటకంతో ప్రారంభమైన సంస్థ  తర్వాత మరికొన్ని నాటకాలను కూడా  ప్రదర్శించిన తర్వాత  మురళీమోహన్ గారు సినీ రంగ ప్రవేశం చేయడంతో  నాటకాలు ఆగిపోయినాయి  మాచినేని వారి బాణీ చాలా కొత్తగా  అతి సహజంగా ఉంటుంది  వాక్యాలను పలికించడంలో  ఒకరి పద్ధతికి మరొకరు  దగ్గరగా లేకుండా  వారి శైలిలో మార్పుని చెప్పి  నటీనటులను తీర్చిదిచ్చిన మంచి దర్శకుడు  చైర్మన్  నాటకం మొదటి ప్రదర్శనకు  దానిలో ప్రత్యేకించి కృష్ణ సినీ నటుడు  కథానాయకుడిగా  పరిచయం కావడం  దర్శకత్వ బాధ్యత వహించి  మూడు పర్యాయాలు ప్రదర్శనలు అయిన తర్వాత కృష్ణ గారు మద్రాసు వెళ్లి సినీ నటుడిగా  జీవితాన్ని ప్రారంభించారు.
నాన్నగారు రాజుగారు  అనేక రకాల నాటకాలను రాయడంలో సిద్ధహస్తులు  వారు రాసిన ప్రతి నాటకాన్ని మాచినేని వారే  దర్శకత్వ బాధ్యత వహించి ప్రదర్శించేవాడు అలా అనేక  నాటకాలు నాన్న గారితో ప్రదర్శనలు జరిగాయి  నాన్నగారు హరికథలు రాయటంలో మంచి పేరు సంపాదించారు  విద్యాధరపురంలో శర్మ గారి లాంటి  పౌరాణికులకు  కథలను ఇచ్చి దాని బాణీ కూడా నాన్నగారే వారికి నేర్పి  నా ద్వారా  ఆకాశవాణిలో కూడా  ప్రసారం చేయించేవారు  సాంస్కృతిక కార్యక్రమాలు అంటే నాన్నగారికి చాలా ఇష్టం  వీటి వల్ల సమాజంలో ఏ కొద్దిపాటి మార్పు వచ్చిన  సంతోషించే వ్యక్తి  వారు అనేకమంది హరిదాసులను  బుర్రకథలు చెప్పే వారిని ప్రోత్సహించేవారు.
బుర్రకథ చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ లో నాజర్  గారిని మించిన వారు మరొకరు లేరు  వారితో నాన్న గారికి మంచి పరిచయం ఉంది వారిని విజయవాడ పిలిపించి వారి ఇంట్లోనే  సాధన చేయించి నాన్నగారు వ్రాసిన  అనేక బుర్రకథలను వేదికపై వినిపించారు  ప్రత్యేకించి  తనకు ఇష్టమైన కథనాయకుడు నిజ జీవితంలో అల్లూరి సీతారామరాజు జీవితాన్ని  ఆధారం చేసుకుని  బుర్రకథ రాసి నాజర్ గారితో చెప్పించడం  విశేషం  నా జరగారు అన్ని బుర్రకథలను చెప్పడం వేరు ప్రత్యేకించి సీతారామరాజు కథను చెప్పడం వేరు  ఆ కథ చెప్పేటప్పుడు తానే సీతారామరాజు గా భావించి  వేదికపై  విలయ తాండవం చేస్తుంటే మనం చూసి తీరవలసినదే.


కామెంట్‌లు