ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు ;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 ఆకాశవాణి కేంద్రంలో నాకు ఉషశ్రీ గారికి  అత్యంత స్నేహితుడు  ఉష శ్రీ గారికి బైబిల్ పాఠాలు నేర్పిన వాడు  సోదరుడు రాజారావు  ప్రతి ఆదివారం  గుడికి వెళ్లి బైబిలు పాఠాలు చెప్పడం అతని అలవాటు  ఒకరోజు మాటల సందర్భంగా  మీ జీవితం మీ మాటల్లో శీర్షిక నేను చేస్తున్న కార్యక్రమాల గురించి  వివరాలు అడిగి మంచి పండితుడు  విషయ పరిజ్ఞానం కలిగిన వాడు  పండిట్ సిహెచ్  ఫ్రాన్సిస్ గారు ఉన్నారు  వారు  రికార్డు చేయ తగిన మనిషి  అని చెప్పిన తర్వాత నేను నాన్న గారితో మాట్లాడి  ఇద్దరం కూర్చుని ప్రశ్నలు అడగడం ఆయన సమాధానాలు చెప్పడం  మొదట ఆయన జీవితం  ఆయన పుట్టుక హిందువు  ఉపనిషత్తులు  పూర్తిగా తెలిసినవాడు  వేద పరిజ్ఞానం ఉంది  కొన్ని పరిస్థితుల వల్ల మతం మార్చుకున్నాడు.
నాన్నగారు అడిగిన మొదటి ప్రశ్న  మీరు మతం మార్చుకోవాల్సిన అవసరం ఏమిటి  ప్రత్యేక కారణాలు ఏవైనా ఉన్నాయా  అని అడిగినప్పుడు  వేదాలలో చెప్పిన విషయాలను  సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే పరిభాషలో  పరిశుద్ధ గ్రంధం ఉన్నది  దానిని ప్రచారం చేయడం కోసం నేను ఈ పని చేశాను అని  చెప్పారు  ఫ్రాన్సిస్  వేద విషయాలు  సులభతరం చేసి చెప్పదలుచుకున్నట్లయితే  మతం మార్చుకోవాల్సిన అవసరం ఏం ఉంది  పెద్దలు చెప్పిన శ్లోకాన్ని చదివి  మీకు సంస్కృతం తెలుసు కనుక దానిని ప్రజల భాషలలో అనువదించి చెప్పడం  చేయవచ్చు కదా  అనగానే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి  అవేవీ బయటకు చెప్పేవి కావు  అలాంటి ప్రశ్నలు వేయకండి అన్నాడు. అమ్మను అమ్మ అని పిలవకుండా  పిన్ని అని పిలిచే వారిని మనం ఏమని  అంటాం  నీకు జన్మనిచ్చిన తల్లిని వదిలి  పిన్ని సాన్నిహిత్యాన్ని పొందుతాను అంటే  ముందు మనసు ఒప్పుతోందా  కన్నతల్లిని వదిలి వేసే వ్యక్తిని కిరాతకుడు అని కదా పిలుస్తారు  అనేసరికి ఆయనకు కోపం వచ్చి  నేను ఈ కార్యక్రమం చేయను అని లేచి వెళ్ళిపోయాడు  తర్వాత సోదరుడు రాజారావుకి చెబితే  ఆయనకు కొంచెం తిక్క ఉన్నది  ఆయన చెప్పేటప్పుడు మనం అడిగితే  ఆయనకు కోపం వస్తుంది  ఇక్కడ చర్చలో కూడా అంతే ఆయన మాట్లాడేటప్పుడు ఇంకెవరు మాట్లాడకూడదు  అని చెప్పడం  వారిని సమర్ధించడం కోసమో మమ్మల్ని సంతృప్తి పరచడం కోసమో మాకు అర్థం కాలేదు.


కామెంట్‌లు