ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 ప్రముఖ గాంధేయవాది  బొజ్జాఅప్పల స్వామి గారు  వారు ఒక రోజు ఆకాశవాణి విశాఖపట్నం అక్కడ  కృష్ణశాస్త్రి  డ్యూటీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు  స్వామి గారి అబ్బాయి  కృష్ణశాస్త్రి.  నేను విశాఖపట్నం వెళ్ళగానే నన్ను మొదట  పలకరించిన వారు వారే నీవు నిన్నటి వరకు విజయవాడ బ్రాహ్మణులలో కలిసి వచ్చావు  నా పేరులో ఉన్న శాస్త్రి  చూసి నన్ను కూడా ఆజాతి వాడే అనుకోవద్దు నేను దళిత జాతి వాడిని స్వామి గారు మా నాన్నగారు  నీలం సంజీవరెడ్డి గారి శిష్యులు ఆశయానికి ఆదర్శంగా మెలిగిన వ్యక్తి  గాంధీజీ చెప్పిన ప్రతి అక్షరాన్ని తూచా తప్పకుండా నడిపిన వాడు  రెండు పర్యాయాలు  ఎంఎల్ఏ గా  ఎన్నికై  తన ప్రాంతానికి ఎంతో సేవ చేసిన  వ్యక్తి మా నాన్న  అని పరిచయం చేశాడు కృష్ణ శాస్త్రి గారు. వారి గురించి నాన్నగారితో చెబితే  అలాంటి ఆదర్శప్రాయుణ్ణి మనం రికార్డు చేయాలి  అని చెప్పిన తరువాత  నాన్నగారు నేను కలిసి వారి గ్రామానికి వెళ్లి  వారితో మూడు గంటలు  రికార్డు చేశాము  కడజాతిలో జన్మించిన  ఉన్నత జాతి లక్షణాలే తప్ప  ఎలాంటి దుర్గుణాలు లేని వ్యక్తి  గాంధీజీ లాగానే  పంచి తప్ప  మరొక వస్త్రం వారికి లేదు  కడజాతి వారు అనగానే  గొడ్డు మాంసాన్ని కూడా తినేవాడు అని అభిప్రాయం  చాలామందిలో ఉంటుంది  కానీ వీరు కోడిగుడ్డు కూడా  ముట్టరు   పూర్తి శాకాహారి  సాత్వికంగా మాట్లాడడం తప్ప  పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఆయన జీవితంలో లేవు  సాధ్యమైనంతవరకు ఇతరులకు  సహకరించడంతోనే  వారి జీవితం కొనసాగింది.
ఒక పర్యాయం బెజవాడ గోపాల్ రెడ్డి  గారు సీఎంగా ఉన్నప్పుడు  అప్పట్లో ఐఏఎస్ గాని ఐపిఎస్ గాని  ఉద్యోగులకు  సీఎం సంతకం  తప్పక ఉండాలి అన్నది  నియమం  స్వామి గారు తనకు తెలిసిన ఒక స్త్రీ  ఐపీఎస్  అధికారిగా ఎన్నికై  ఉద్యోగ  నిర్వహణ కోసం  సీఎం సంతకం కోసం  స్వామివారు ఆమెను  రెడ్డి గారి దగ్గరకు తీసుకు వచ్చారు  ఆరోజు రెడ్డి గారు జ్వరంతో ఉన్నారు  అలాగేనమ్మా నీవు వెళ్లి వరండాలో కూర్చో  అని రెడ్డి గారు చెప్పిన తర్వాత  ఆమె మర్యాద పాటించింది  అప్పల స్వామి గారూ ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్న సమయం కదా మీరు నాకు సహాయం చేయగలరా  అని అడిగితే  ఏం చేయాలో చెప్పండి సాధ్యం అయితే చేస్తాను అన్నారు  పెద్ద పనేం కాదు మీ ఓటు నాకు వేయాలి  అనేసరికి కూర్చున్న అప్పల స్వామి గారు లేచి నిలబడి ఇలా అన్నారు.


కామెంట్‌లు