ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 గోపాల రెడ్డి గారూ మీరు ఉన్నత కుటుంబంలో ఉండవచ్చు సీఎం గా  బాధ్యతలను నిర్వహిస్తూ ఉండవచ్చు  అంత మాత్రం చేత ఇతరులను  చులకనగా చూడడం తగదు  నాకు కులం లేదు తప్ప  గుణం ఉన్నది  నేను సంజీవరెడ్డి గారి మనిషినని మీకు పూర్తిగా తెలుసు  అయినా నన్ను ఓటు అడుగుతున్నారు అంటే నేను మాట తప్పే వాడిని కృతజ్ఞత లేని వాడిని అనేకదా మీ అభిప్రాయం  మీరు సంతకం చేయకపోతే మరొక నెలలో ఆమెకు ఉద్యోగం వస్తుంది  దానికోసం నేను మీకు ఓటు వేసే నీచ స్థితికి దిగజారను  నా గురించి మీరిలా అడగడం  నా తత్వం తెలిసి కూడా అడగడం  నాకు బాధగా ఉంది  అనే సరికి వెంటనే రెడ్డి గారు  పత్రికా విలేకరులను పిలిచి  బొజ్జా అప్పల స్వామి గారి లాంటి నిజాయితీపరుడైన ఎమ్మెల్యే ఉంటే  నేను  సంజీవరెడ్డి కొట్టుకున్నట్లుగా  ఎవరు కొట్టుకోరు  అని  చెప్పడం వారి నిజాయితీ కి నిదర్శనం. అప్పలస్వామి గారికి  దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు అంటే చాలా ఇష్టం  వారి కవితలు  మిగిలిన రచనలు  ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెప్పగలరు  వారు రాసిన ప్రతి అక్షరం  స్వామి గారి మస్తిష్కంలో  నిక్షిప్తమై ఉన్నది  వారిపై ఉన్న మమకారంతో స్నేహంతో  ఆ గుర్తు చివరి వరకు ఉండేలా తన కుమారునకు  బొజ్జా కృష్ణశాస్త్రి అని పేరు పెట్టారు  ఇది వారి సాహిత్యఅభిలాషకు   గుర్తు  వారి చిన్నబ్బాయి  విప్లవకారుడు  తనుమాట పడడు ఇతరులను మాట అనడు  రాష్ట్రం కోసం ఏది కావలిసి వచ్చిన  ముందుండి  ఉద్యమాన్ని నడిపి  పెద్దలకు ఆ ఉద్యమ మూలాన్ని తెలియజేసి  విజయవంతం చేసే వరకు  పోరాడే ఘటికుడు  తనకోసం ఏమి చేయడు సమాజానికి తప్ప.కామెంట్‌లు