ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 రాజు గారికి సన్నిహిత మిత్రులు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు స్వతంత్ర సమరయోధులుగా  ఇద్దరూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది  తరువాత ఆయనే కొన్ని నాటకాలను  కుటుంబ స్థితిగతులను  తెలియజేస్తూ చక్కటి నాటికలను నాటకాలను వ్రాసి  తమ సంస్థ ద్వారా  ప్రదర్శించేవారు  విశాఖపట్నంలోనే కాక వివిధ ప్రాంతాలలో ఆ నాటకాలను ప్రదర్శిస్తూ  ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచారు రాజుగారు రాజకీయాల్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా దేశ భవిష్యత్తు కోసం ఏది చేయడాని కైన సిద్ధంగా ఉన్న  మనస్తత్వం వారిది  నిజజీవితంలో సాత్విక స్థితి  అదే వేదిక పైన  రకరకాల పాత్రలలో  దుష్ట పాత్రలను వహించినవి కూడా  వారికి పేరు తెచ్చి పెట్టినవే  ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో కూడా  వారితో కలిసి నేను  నాటకాలకు న్యాయ నిర్ణేతగా వెళ్లేవాడిని  ఆయనతో పాటు నన్ను  అక్కడ ఉపన్యాసాలు ఇవ్వడానికి కూడా పిలిచేవారు.
ప్రత్యేకంగా  బాబి వర్ధన్  జర్నలిజంలో  నా అనుభవాలను వారి విద్యార్థులకు తెలియజేయమని  అనేక పర్యాయాలు పిలిచేవారు  తర్వాత విద్యార్థులు అడిగిన వారి అనుమానాలన్నిటిని తీర్చడానికి  ఒక అరగంట సమయం కేటాయించే వాళ్ళం  అలా వారందరితోనూ పరిచయాలు బాగా పెరిగినాయి  తర్వాత చాట్ల శ్రీరాములు గారు  నాటక శాఖ నిర్వహిస్తున్న సందర్భంగా  రంగస్థలం నాటకాలకు రేడియో నాటకాలకు ఉన్న బేధాలను  తెలియజేయడం కోసం నా ఉపన్యాసాలు ఏర్పాటు చేసేవారు  అక్కడ కూడా విద్యార్థులు అందరూ కూడా  ఎలాంటి మొహమాటం లేకుండా  వారి అనుమానాలను అన్నిటినీ తీర్చుకుంటూ ఉండేవారు  అలా నాటక శాఖలో ఉన్న  విద్యార్థులందరూ నాకు పరిచయం కావడం వారిలో చాలా మందిని రేడియోకి పరిచయం చేయడం  వల్ల వారు నాకు బాగా పరిచయం అయ్యారు. మా అందరి చేత పాండు అని పిలిపించుకునే పాండురంగరావు నాతోపాటు పని చేసిన వాడు  నాటకాలు వేయడంలో వేయించడంలో  అభిరుచి గలవాడు  అలాంటివాడు ఒకరోజు నాన్నగారిని పరిచయం చేయమని  అడిగితే వారి దగ్గరికి తీసుకెళ్లాను  అనేక విషయాలు మాట్లాడుకున్న తర్వాత మీరు ఆయుర్వేదంలో అద్భుతంగా నూతన పద్ధతులలో వైద్యం చేస్తారని విన్నాను  మీ కృషి ఆకాశవాణి ద్వారా తెలిస్తే మరి కొంతమంది  అనారోగ్యంతో బాధపడుతున్న వారికి  తెలుస్తుంది  వారిని బాగు చేసే పుణ్యం మీకు దక్కుతుంది  నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని గురించి  మీ అబ్బాయి ఆనంద్ తో కబురు చేస్తాను  ఆ సమయానికి వచ్చి చదివి వెళ్ళవచ్చు  అని తన వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడి  తన ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను తెలుసుకొని వెళ్ళాడు.

కామెంట్‌లు