అష్టాక్షరీగీతి, కవితాప్రక్రియ:- జయ కృష్ణ! కృష్ణ ప్రియ!; - "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
 శ్రీకృష్ణ! యదుభూషణ!
     పాండవ మధ్యము డైన
     అర్జునుని సఖుడవు!
     జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
             🪷(2)
      సంగ్రామ రంగము నందు
     మహారథికుడు నైన
     పార్థునకు సారధివి!
     జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
            🪷(3)
      జీవన వేదము నైన
      విజ్ఞానమును తెల్పిన
      గీతాచార్యుడవు నీవె!
      జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
             🪷(4)
      అంతటా వ్యాపించి యున్న
      వాసుదేవుడవు నీవె!
      అచ్యుతాzనంత! గోవింద!
     జయ కృష్ణ! కృష్ణ ప్రియ!

    🔱కృష్ణం వందే జగద్గురుమ్!

కామెంట్‌లు