సంసారదుఃఖ హరుడు.. శివుడు- "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 9912767098

  🪷ఈ సంసారము లోనున్న
      దుఃఖములు హరియించు!
      తాపత్రయ హర! శివ!
      శివా నమో! నమః శివా!
         (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
 ⚜️భక్తమహాశయులకు.. సాంబ సదాశివుని ధ్యానము, అర్చనము, అభిషేకము, మంత్రజపము.. మున్నగు వాటివలన పరమేశ్వరుని దివ్యానుగ్రహము లభించినది. తత్త్వజ్ఞానము కలిగినది! నిత్యము శ్రీకైవల్యప్రాప్తికి సాధనమైన పరమేశ్వర పాదపద్మములను, భక్తిశ్రద్ధలతో సేవిoచుచున్నారు!
🔱ఓ గౌరీప్రియా! శివా! బ్రహ్మదేవుడు.. లలాటమందు వ్రాసిన.. దుష్టలిపి ఫల సూచకములు; పాపకర్మముల వలన గలిగిన.. దురదృష్ట దుఃఖములు; దురహంకారముతో కూడిన... దుర్వచనములు తొలగిపోయినవి. వేదోపనిషాదుల సారమైన, నీ దివ్య చరిత్రమును గ్రోలుచున్న నన్ను, నీ కరుణా కటాక్ష వీక్షణములతో నుద్ధరింపుము స్వామి! అని, వేడుకొను చున్నారు!
      ఈ శ్లోకమునందు.. సమస్తదుర్దోష శాంతికి, అహంభావ నివృత్తికి.. శ్రీస్వామివారి కృపాకటాక్షమును కోరుచున్నారు! అట్లే, ఈ సంసార సాగరం నుండి, నన్ను తరింపజేయ వలసిందిగా ప్రార్థించుచున్నారు, జీవన్ముక్తులైన ఆది శంకరులు!
🪷 దూరీకృతాని దురితాని దురక్షణాణి
      దౌర్భాగ్య దుఃఖ దూరహంకృతి దుర్వచాంసి 
     సారం త్వదీయ చరితం నితరాం పిబంతం
      గౌరీశ! మామిహ సముద్దర సత్కటాక్షైః !!
    (శ్రీ శివానంద లహరి.. 92.వ.శ్లోకము)
                    🪷🌷🪷
         🚩తేటగీతి పద్యం 
   దుఃఖ దౌర్భాగ్య దారిద్ర్య దురిత
   చయము, పారద్రోలెను నీచూపు పార్వతీశ!
    నీదు చారిత్ర సారము నిత్య దీక్ష
    త్రావు నన్నుద్ధరింపు! మా తండ్రి వీవ!
             (రచన:- డా. శ్రీపాదుక)
                🪷🌷🪷
          🚩 తేట గీతి పద్యం 
   దురిత దౌర్భాగ్య దుర్గర్వ దుఃఖదములు 
   దుర్వచనములు తొలఁగి సుదూర మయ్యె! 
    గిరిశ ! సారభూతంబు నీ చరితమెల్ల
   తనివి తీరగ గ్రోలెడు నను, కటాక్ష 
   దృష్టి సారించి వే యుద్ధరింపు మయ్య!
        (రచన:- కార్యంపూడి రాజమన్నారు )
        
    🕉️ నమఃశివాయై నమఃశివాయ!
కామెంట్‌లు