చిన్న పిల్లలు;- -గద్వాల సోమన్న,9966414580
అద్దం వంటి బాలలు
ముద్దులొలికే  పూవులు
సద్దు చేసే బుడతలు
సుద్దులేమో తేనెలు

వృద్ధికి మేలి పథములు
శుద్ధమైనవి పదములు
హద్దులు మీరని పిల్లలు
ముద్దబంతుల తావులు

చల్లని వెన్నెల జల్లులు
తెల్లని మల్లె మొగ్గలు
ఎల్లరి మెచ్చే కూనలు
కల్లలెరుగని వేల్పులు

చుక్కలాంటి బాలలు
మొక్కల్లాంటి మనసులు
చక్కని నగవుల ముఖములు
మిక్కిలి ఇంటికి వెలుగులు

ఉన్నతమైన వ్యక్తులు
వెన్న ముద్దల సొగసులు
ఉన్న ఊరికి ఘనతలు
కన్నవారికి గురుతులు

బుగ్గలు చూడ చిగురులు
సిగ్గులేమో కెంపులు
సగ్గుబియ్యం నడకలు
ముగ్గులు ముంగిట బాలలు


కామెంట్‌లు