తెలుగు పదాల ఘనత;- -గద్వాల సోమన్న,9966414580
అనురాగములో రాగము
మందారములో దారము
ఉన్నది ఉన్నది ఉన్నది
వెటకారములో కారము

పరివారములో  వారము
పని భారములో భారము
ఉన్నది ఉన్నది ఉన్నది
సంహారములో హారము

యమపాశములో పాశము
వనవాసములో వాసము
ఉన్నది ఉన్నది ఉన్నది
దరహాసములో హాసము

ఆకాశములో కాశము
సందేహములో దేహము
ఉన్నది ఉన్నది ఉన్నది
సందేశములో దేశము


కామెంట్‌లు