యదార్థమేనా?- -గద్వాల సోమన్న,9966414580
తీయగా పాడుతుంది కోయిల
చల్లగా కురుస్తుంది వెన్నెల
చిన్నారుల హృదయమే కోవెల
వారుంటే సదనమే కళకళ

సన్నగా నవ్వుతుంది పాపాయి
హాయిగా ఉంటుంది నడిరేయి
సదనంలో మగువలే వెలుగులు
వదనంలో నగవులే సొగసులు

చక్కగా ఆడుతుంది నెమలమ్మ
ముద్దుగా పలుకుతుంది చిలుకమ్మ
మిలమిల మెరుస్తుంది తారమ్మ
గలగల పారుతుంది యేరమ్మ

పచ్చగా ఉంటుంది మొలకమ్మ
గొప్పగా వెలుగుతుంది దివ్వెమ్మ
త్యాగానికి చిహ్నం మన అమ్మ
కుటుంబంలో ఫలించే కొమ్మ


కామెంట్‌లు