మా మంచి తాతయ్య- -గద్వాల సోమన్న,9966414580
ఇంటిలో పెద్దయ్య
మా మంచి తాతయ్య
కథలను చెప్పుతాడు
మమతలు చూపుతాడు

ఒడిలోన పెట్టుకొని
మంచిని పెంచుతాడు
మా చేతిని పట్టుకొని
తన వెంట త్రిప్పుతాడు

అనుభవాలు జోడించి
హితబోధ చేస్తాడు
ప్రేమను రంగరించి
మనసుల్లో పోస్తాడు

బలే బలే తాతయ్య
బంగారు తాతయ్య
ఇంటిలోన ఉంటే
అండెంతో తాతయ్య


కామెంట్‌లు