హితోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
సర్దుబాటు ఉంటేనే
సమస్యల పరిష్కారము
సత్సంబంధాలకది
చూడ చక్కని మార్గము

వాదనలు ఎక్కువైతే
భేదాలు దాపురించు
చిలికి చిలికి గాలివానై
మనశ్శాంతి అంతరించు

రాజీ లేని జీవితము
ఉప్పొంగే సముద్రము
ఉవ్వెత్తున ఎగసిపడి
ఉసూరుమనే కెరటము

అవగాహన ఉంటేనే
అన్ని పనులు సఫలీకృతము
లేక బూడిదలో బోసిన
పన్నీరుకూ సమానము


కామెంట్‌లు