అమ్మలాంటి అవ్వ- -గద్వాల సోమన్న,9966414580
అమ్మలాగ అవ్వ
తినిపిస్తుంది బువ్వ
కథలెన్నో చెప్పును
ఒడిలో లాలించును

అమ్మ కోపగిస్తే
అక్కున చేర్చుకొనును
అల్లరి చేస్తేను
ప్రేమతో సహించును

బజారుకు వెళ్ళితే
బొమ్మలను తెస్తుంది
నాన్న కాస్త తిడితే
వెన్నంటి ఉంటుంది

అవ్వ మనసున అమ్మ
చూస్తే కన్పించును
గృహమున  పెద్దదిగా
బాధ్యతగా ఉండును

అవ్వంటే ఇష్టము
అమ్మ వోలె ప్రాణము
కుటుంబాన అవ్వకు
ఉన్నతమైన స్థానము


కామెంట్‌లు