ఉంటే అందము;- -గద్వాల సోమన్న,9966414580
తరువున ఫలములు
మనసున మమతలు
ఉంటే అందము
గృహమున పిల్లలు

జడలో పూవులు
మెడలో మాలలు
ఉంటే అందము
ఒడిలో కూనలు

గుడిలో గంటలు
మడిలో పంటలు
ఉంటే అందము
బడిలో బాలలు

పక్షికి ఈకలు
కంటికి రెప్పలు
ఉంటే అందము
మేనుకు వలువలు

నైతిక విలువలు
కొలనున కలువలు
ఉంటే అందము
ముఖమున నగవులు

చెరువున జలములు
ఇహమున వనితలు
ఉంటే అందము
బ్రతుకున ప్రేమలు

ఇంటికి తలుపులు
మింటికి తారలు
ఉంటే అందము
చక్కని మొక్కలు

పూవుల తోటలు
నగవుల కోటలు
ఉంటే అందము
ఊరికి బాటలు


కామెంట్‌లు