చిట్టి చెల్లెలు;- -గద్వాల సోమన్న,9966414580
మా ఇంటి తోటలోన
వికసించిన సిరిమల్లి
ప్రేమలొలుకు కోటలోన
ఇష్టమైన మా చెల్లి

సువిశాల జగతిలోన
అందాల చిట్టి తల్లి
ఆ గగన సీమలోన
వెలుగులీను పాలవెల్లి

మా కంటి పాప చెల్లి
ఫలించే ద్రాక్షావల్లి
చిలుక పలుకులతోడ
అలరించే శ్రీ వల్లి

కుటుంబాన దీపము
మా ఆశల రూపము
మా ముద్దుల చెల్లెలు
మా గుండెల శ్వాసలు


కామెంట్‌లు