లేత గులాబీలు;- -గద్వాల సోమన్న,9966414580
లేలేత గులాబీలు
పసి పిల్లల హృదయాలు
చిన్నారుల మోముల్లా
మదిని దోచు అందాలు

గులాబీల మొగ్గలే!
సుతిమెత్తని బుగ్గలే!
పరిమళాలు వెదజల్లు
పసి కూనల సిగ్గులే!

విచ్చుకున్న గులాబీలు
అచ్చంగా బడి పిల్లలు
చూడంగా  కనుదోయి
లేత గులాబీ రేకులు

చాచా నెహ్రూజీకి
ఇష్టమైన గులాబీలు
పూల వ్యాపారులకూ
లాభ సాటి గులాబీలు

పన్నీరు తయారీలో
పెక్కు శుభ కార్యాల్లో
పనికొచ్చు గులాబీలు
ఇంటి అలంకరణలో

గులాబీలు,చిన్నారులు
అందరికీ బహు ఇష్టము
పెరటిలో ,సదనంలో
ఉంటేనే మనోహరము


కామెంట్‌లు