బడికి వెళ్ళు బాలలు;- -గద్వాల సోమన్న,9966414580
బడికి వెళ్ళు బాలలు
చదువులమ్మ పుత్రులు
అక్షరాల మిత్రులు
అవనిలోన ప్రమిదలు

జ్ఞానానికి వారసులు
పాఠశాల పాలకులు
భారతీయ సైనికులు
భారతి నగుమోములు

బడి కొలనులో కలువలు
గుడి దివ్వెల వెలుగులు
పుస్తకాల ప్రేమికులు
గురుదేవుల శిష్యులు

వారుంటేనే కళకళ
పాఠశాలలు తళతళ
వారు లేక బడులన్ని
పోవునోయి వెలవెల

చిన్నారుల సంపదలు
అమూల్యమైన చదువులు
నేర్చుకొను అక్షరాలు
బాగు చేయు జీవితాలు


కామెంట్‌లు