నా(నే)టి కుటుంబాలు...;- -గద్వాల సోమన్న,9966414580
ఆనాటి కుటుంబాల్లో
అనురాగాలుండేవి
అడుగడుగునా  ప్రేమలు
అక్షరాల పండేవి

ఉమ్మడి కుటుంబంలో
ఆనందం విరిసేది
సమైక్యత అందరిలో
జీవనదులై పారేది

రాను రాను కుటుంబాల్లో
మార్పులెన్నో వచ్చాయి
మితిమీరిన స్వార్థంతో
పెను మార్పులు తెచ్చాయి

కుటుంబ వ్యవస్థ నేడు
కుక్కలు చింపిన విస్తరి
ప్రేమలు చల్లారితే
మిగిలేది ఇంతే మరి


కామెంట్‌లు