ఉంటే మంచిది;- -గద్వాల సోమన్న,9966414580
శుచిగా బుద్ధులు
రుచిగా సుద్దులు
ఉంటే శుభములు
నోటికి హద్దులు

ఇంటికి పిల్లలు
కంటికి రెప్పలు
ఉంటే  అందము
మింటికి చుక్కలు

చక్కని నడతలు
చిక్కని మమతలు
ఉంటే ఘనతలు
నైతిక విలువలు

గృహమున వనితలు
ఇహమున గురువులు
ఉంటే శ్రేష్టము
పుడమిని తరువులు


కామెంట్‌లు