త్యాగమయులు పూవులు;- -గద్వాల సోమన్న,9966414580
సొగసులీను సుమములు
వెదజల్లును తావులు
దైవార్చన సమయాన
ఉపయోగం ఇహమున

సూదులతో గ్రుచ్చినా
చేతులతో నలిపినా
క్షమాగుణం చూపును
పరిమళాలు పంచును

త్యాగమయులు పూవులు
పసి పిల్లల నగవులు
మృదు స్వభావంతో
మన ఘనతను పెంచును

మగువల జడల్లోన
మహనీయుల మెడలోన
విడిది చేసే విరులు
పూలతోటల్లోన


కామెంట్‌లు