బంధాలు-అనుబంధాలు- -గద్వాల సోమన్న,9966414580
విలువైనవి బంధాలు
కాకూడదు శిథిలాలు
సఖ్యతతో కావాలి
బలమైన కట్టడాలు 

పాడైతే బంధాలు
ఉండవోయి!అందాలు
చివరకూ మిగులునోయ్!
వాడినట్టి కుసుమాలు

మానవ సంబంధాలు
ఉండాలి మంచిగా!
బ్రతుకున అనుబంధాలు
పండాలి గొప్పగా!

బంధమే కుటుంబాన
అందము ఆనందము
అన్ని సమయాలలోన
అందించు ఆహ్లాదము


కామెంట్‌లు