కడిగిన ముత్యాలు పిల్లలు- -గద్వాల సోమన్న,9966414580
మాయమర్మం లేనివారు
కల్లకపట మెరుగని వారు
వారే వారే పసి పిల్లలు
లేరే లేరే సమానులు

భువిని వెలసిన పుణ్యమూర్తులు
సదన నింగిని రవిచంద్రులు
స్వేచ్ఛగా ఎగిరే ఖగములు
బుడిబుడి నడకల చిన్నారులు

కిలకిల నవ్వే నెలవంకలు
గలగల పారే సెలయేరులు
బాలలు కడిగిన ముత్యాలు 
మిలమిల మెరిసే తారకలు

మన రేపటి భారత పౌరులు
ఘన భారతమ్మ ప్రియ బిడ్డలు
దేశాభివృద్ధికి బాటలు
పాపమెరుగని పసికందులు


కామెంట్‌లు