క్రుంగదీయు కలతలు- -గద్వాల సోమన్న,9966414580
గుండెలోని కలతలు
మండు చుండు నిప్పులు
మదిని శాంతి చోరులు
విష సర్పపు కోరలు

వదిలేస్తే మేలులు
జరుగునోయి శుభములు
ఉండును సుఖశాంతులు
వికసించును మనసులు

కలత లేని బ్రతుకులు
కాంతులీను ప్రమిదలు
ముద్దులొలుకు పైరులు
ముద్దబంతి సొగసులు

వీడాలోయ్! కలతలు
వర్ధిల్లును బ్రతుకులు
విరియాలోయ్! నగవులు
కురియాలోయ్!  మమతలు


కామెంట్‌లు