వదినమ్మ;- -గద్వాల సోమన్న,9966414580
మా అన్నయ్యకు సతి
మా మంచి వదినమ్మ
ఆమెతో పురోగతి
మా సదనాన అమ్మ

అనురాగాలతోడ
అలరించే దేవత
అసహనమే చూపక
నిర్వహించు బాధ్యత

మేమంటే ప్రాణము
చూపించును ఇష్టము
తల్లి మనసు చూపించి
పంచును సమానము

ఇష్టమైన వదినమ్మ
ఇంటిలోన దీపము
ఇంటిల్లిపాదికిల
ప్రేమలొలుకు రూపము


కామెంట్‌లు