సంఘ జీవులు చీమలు;- -గద్వాల సోమన్న,9966414580
చిట్టి చిట్టి చీమలు
సృష్టిలోన జ్ఞానులు
వసుధలోన  నేర్పును
విలువైన పాఠాలు

సంఘజీవులు చీమలు
సమైక్యత చాటును
మేలుకొలుపు నడతలు
క్రమశిక్షణ తెలుపును

నిస్వార్ధ జీవులు
ఆహారం పంచును
బలగమనిన ఇష్టులు
ప్రేమ చూపి నడుపును

ప్రాణుల్లో చిన్నవి
జ్ఞానంలో మిన్నవి
ఆదర్శం చూపును
పామునైన చంపును


కామెంట్‌లు