ముద్దుల తమ్ముడు;- -గద్వాల సోమన్న,9966414580
మా ముద్దుల తమ్ముడు
మా ఇంటికి భానుడు
అందరికి ప్రియమైన
అందాల చందురుడు

ఇంటిలోన కనిష్ఠుడు
మా కంటికి సుందరుడు
అమ్మానాన్నలకూ
ఎంతెంతో ఇష్టుడు

బొమ్మలాగ ఉంటాడు
మాటలెన్నొ  చెపుతాడు
గిలిగింతలు పెడితే
చిలుకలా నవ్వుతాడు

గేలి చేస్తే అలుగుతాడు
లాలిస్తే వాలుతాడు
చెలిమితో నిమిరితే
కలిసిపోయి అడుతాడు

గోల గోల చేస్తాడు
నేలుపాలు చేస్తాడు
తమ్ముడుంటే మజా
మాకు వాడే రోజా

బలే బలే  తమ్ముడు
చిన్నపాటి భీముడు
చలువ పూలు వెదజల్లు
పున్నమి వెన్నెల రేడు


కామెంట్‌లు