మేనమామ చందమామ;- -గద్వాల సోమన్న,9966414580
మా అమ్మ సోదరుడు
మాకెంతో ఇష్టుడు
అందాల చందమామ
అవనిలో మేనమామ

ప్రేమగా చూస్తాడు
అండగా ఉంటాడు
మా ఇంటికి వస్తే
బహుమతులు తెస్తాడు

ఛలోక్తులు విసరుతాడు
చేయి పట్టి నడుపుతాడు
వారింటికెళ్ళితే
ఎత్తుకుని తిరుగుతాడు

ఘనుడే మేనమామ
గొప్పది హృదయ సీమ
మహిలో  బహుమానము
మదిలో అసమానము


కామెంట్‌లు