మా అన్నయ్య;- -గద్వాల సోమన్న,9966414580
మా తోబుట్టువు అన్న
మా తోడు నీడ అన్న
నాన్న పిదప మాకు మిన్న
మనసు చూడ తీపి వెన్న

ఉండునులే అండగా
అభిమానం మెండుగా
అమూల్యమైన కానుక
కుటుంబంలో దీపిక

ఆదర్శం చూపించును
మంచి దారి నడిపించును
కంటికి రెప్పలా అన్న
ఎత్తుకుని ముద్దాడును

భుజంపై మోసుకొనును
చంకలో  ఎత్తుకొనును
బొమ్మలను చూపించి
మనసులను మురిపించును

తన వెంట తీసుకెళ్లును
ఆటలెన్నొ ఆడించును
ఈగ వాలనివ్వడోయ్!
ప్రేమెంతో పంచునోయ్!

మా అన్న బంగారం
ఇంటిలోన సింగారం
కన్నుల పండుగ చేస్తూ
విరబూసిన మందారం
కామెంట్‌లు